కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవాల్సిన జగన్ రెడ్డి మోసపూరిత ప్రకటనలతో వంచిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం 9 గంటలు కరెంటు సరఫరా చేస్తామని చెప్పి 7 గంటలు మాత్రమే ఇస్తోందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. జగన్ ప్రకటనలకు కోట్ల రూపాయలు తగలేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.


ధాన్యం కొనుగోలుకి 48వేల 793 కోట్లు, ఇతర పంటలకు 7156 కోట్లు ఇవ్వడం మోసమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  దుయ్యబట్టారు. రైతు భరోసా పేరుతో జగన్ రెడ్డి రైతు దగా చేస్తున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా కింద 13,500 ఇస్తానని 7,500 ఇచ్చారన్న టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  జగన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. పండించిన పంటకు ఎంఎస్ పీకి ఇచ్చేందుకు దిక్కులేదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  ఆక్షేపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: