ఎస్టీలకు రిజర్వేషన్‌ పెంపుపై సీఎం కేసీఆర్ మోసం చేశారని బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ మండిపడ్డారు. వాల్మీకి బోయలకు ఎస్టీ, మాదాసి కురుబకు ఎస్సీ హోదా ఇవ్వాలనే అంశాలను రాజ్యసభలో ప్రస్తావించినట్లు లక్ష్మణ్‌ తెలిపారు.  కేంద్రం ఎస్సీ విద్యార్థులకు 250కోట్ల స్కాలర్‌షిప్‌లు ఇస్తే కేసీఆర్ మ్యాచింగ్ గ్రాంట్‌ ఇవ్వకుండా దళిత విద్యార్థులకు అందకుండా చేశారని ఎంపీ కె లక్ష్మణ్  విమర్శించారు.  రాజ్యసభలో తెలంగాణ, ఆంధ్రా గొంతుగా మారడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఎంపీ కె లక్ష్మణ్  పేర్కొన్నారు.


అసెంబ్లీతో పోలిస్తే పార్లమెంట్‌లో భేషజాలు లేకుండా అన్ని పార్టీల సభ్యులకు అవకాశం ఇచ్చారని లక్ష్మణ్‌  వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేక అబాసుపాలయ్యారని ఎంపీ కె లక్ష్మణ్  ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర పథకాల పేరు మార్పు, నిధుల మళ్లీంపు విషయాలను ప్రస్తావించే అవకాశం వచ్చిందని ఎంపీ కె లక్ష్మణ్  అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా పథకం అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎంపీ కె లక్ష్మణ్  పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: