కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను న్యాయం కోసం ఆశ్రయించారు. రైతులకు అన్యాయం చేసిన జిల్లా కలెక్టర్, అసభ్య పదజాలంతో దూషించి.. విచక్షణ రహితంగా రైతులపై.. లాఠీ చేసిన పోలీసుల పై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు మానహ హక్కుల కమిషన్ ను కోరారు. మాస్టర్ ప్లాన్ కి వ్యతిరేకంగా తాము నిసరన వ్యక్తం చేస్తుంటే... పోలీసులు దారుణంగా వ్యవహరించారని కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

తమకు ఎలాంటి సమాచారం లేకుండా... మాస్టర్ ప్లాన్ లో తమ భూములు లాక్కోవడం తీవ్ర అన్యాయమని కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు అన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రభుత్వ చెప్పు చేతుల్లో పనిచేస్తున్నారని... ఆ రోజు బయటకు వచ్చి తమ వినతి పత్రం తీసుకుంటే ఇంత పెద్ద గొడవకు దారి తీసింది కాదని కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: