ఆంధ్రప్రదేశ్‌.. ఐటీ ఎంఓయూల్లో గణనీయ ప్రగతి సాధించిందని ప్రభుత్వం చెబుతోంది. ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు – ఎలక్ట్రానిక్స్‌ రంగంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో చేసుకున్న ఒప్పందాలపై నిన్న సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సీఎంకు అధికారులు అనేక వివరాలు అందించారు. ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు ఎలక్ట్రానిక్స్‌ రంగంలో 88 ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. వీటి విలువ రూ.44,963 కోట్లని అధికారులు తెలిపారు.


ఇందులో 85శాతం కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించడమో, లేదా ఉత్పత్తికి సిద్ధం కావడమో జరిగిందని అధికారులు సీఎంకు  వెల్లడించారు.  రూ.38,573 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఇవి కాకుండా ఇంకా ఫుడ్‌ ప్రాసెసింగ్‌, పశుసంవర్థక శాఖ, టూరిజం రంగాల్లో ఒప్పందాలపైన కూడా సీఎం జగన్ సమీక్ష చేశారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో పెట్టుబడి ప్రతిపాదనలను వీలైనంత త్వరగా కార్యరూపంలో తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

AP