గ్రూప్ త్రీ, గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఉద్యోగ నియామక ప్రక్రియలను ఆపలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. గ్రూప్ త్రీ, గ్రూప్ ఫోర్ నుంచి టైపిస్టు కమ్ అసిస్టెంట్ పోస్టులను తొలగించారంటూ 101 మంది ఉద్యోగార్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో 2015జీవో ప్రకారం గ్రూప్ త్రీ, గ్రూప్ ఫోర్‌లో ఉన్న టైపిస్టు కమ్ అసిస్టెంట్ ఉన్నాయని పేర్కొన్నారు. అయితే గతేడాది ఆ జీవోను సవరించినట్లు వారు తెలిపారు.


అందుకే గతేడాది ఇచ్చిన 55, 136 జీవోలను కొట్టివేసి.. పాత ఉత్తర్వులను అమలు చేయాలని తెలంగాణ హైకోర్టును కోరారు. అయితే.. ప్రభుత్వానికి, టీఎస్పీఎస్సీకి నోటీసులు జారీ చేసినతెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణను జులై 13కి వాయిదా వేశారు. అయితే అప్పటి వరకు స్టే ఇవ్వాలని పిటిషనర్ల న్యాయవాది కోరారు. అందుకు నిరాకరించిన తెలంగాణ హైకోర్టు నియామక ప్రక్రియ ఆపడం కోర్టుల పనికాదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: