టీడీపీ అధినేత నారా చంద్రబాబును రాజమండ్రి జైలులో చంద్రబాబును చూసి తట్టుకోలేక పోయానని నారా లోకేష్‌ అన్నారు. సీఎం గా అయన ప్రారంభించిన బ్లాక్ లోనే ఆయనను ఉంచడం బాదేసిందన్న నారా లోకేష్‌.. చంద్రబాబుకి న్యాయస్థానాల్లో తప్పకుండా న్యాయం లభిస్తుందన్నారు. న్యాయ వ్యవస్థ పై నమ్మకం ఉందని.. చంద్రబాబు తప్పు చేయకున్నా ఇన్ని రోజులు జైల్లో ఉండటమే బాధగా ఉందని నారా లోకేష్‌ అన్నారు.


న్యాయం జరగడం ఆలస్యం అవుతుంది తప్ప.. జరగకుండా పోదని నారా లోకేష్‌ అన్నారు. దీనిపైన ఖచ్చితంగా  జాతీయ స్థాయిలో చర్చ తప్పకుండ జరగాల్సిందేనన్న నారా లోకేష్‌.. చేయని తప్పుకు జైలుకు పంపితే భవిష్యత్ లో ఇంకెవరైనా రాజకీయల్లోకి వస్తారా అని ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే  కొనసాగితే ప్రజలకు సేవ చేయడానికి నీతిమంతులు రాజకీయల్లోకి రారని నారా లోకేష్‌ అన్నారు. మీడియాతో ఆయన చిట్‌చాట్‌గా మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: