తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులకు శుభాభినందనలు తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. రేవంత్ రెడ్డి గారితో తనకు వ్యక్తిగతంగా స్నేహం ఉందని తెలిపారు. వాగ్ధాటి, ప్రజాకర్షణ కలిగిన నేత రేవంత్ రెడ్డి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారు. రేవంత్‌ రెడ్డి.. రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొని ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.

 
తెలంగాణలో జరిగిన ఉద్యమాలపై సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి అని కొనియాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. నీళ్ళు, నిధులు, నియామకాలు.. ప్రధాన అంశాలుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ అని మెచ్చుకున్నారు. రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేసిన వారి త్యాగాలకు సార్థకత కల్పించాలని ఆకాంక్షించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ప్రజల ఆకాంక్షల మేర సంక్షేమం, అభివృద్ధితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షలు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: