ఆధార్ కార్డు అంటే భారత్ లో ఉండే అందరికి తెలుసు.. ఎందుకంటే ఈ ఆధార్ కార్డు మన ఐడెంటిటీ ప్రూఫ్ కాబట్టి.. ఎక్కడికి వెళ్లిన ఈ ప్రూఫ్ ఖచ్చితంగా చూపించాల్సిందే. అంతేకాదు ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందాలన్న ఆధార్ ఉండాల్సిందే. అలాంటి ఈ ఆధార్ కార్డును యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసింది. 


అయితే ఆధార్ కార్డును మరింత సురక్షితంగా మార్చేందుకు యూఐడీఏఐ మాస్క్‌డ్ ఆధార్ కార్డులను కూడా అందిస్తోంది ఈ యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఎక్కడైనా ఎవరికైన మీరు మీ ఆధార్ నెంబర్ చెప్పడానికి ఇబ్బంది పడితే అప్పుడు ఈ మాస్క్‌డ్ ఆధార్ నెంబర్ ఇవ్వొచ్చు. ఈ మాస్క్‌డ్ ఆధార్ కార్డును డిజిటల్ సైనాడ్ ఈ ఆధార్ గా తీసుకోవచ్చు. ఈ మస్కాడ్ ఆధార్ వల్ల మీ ఆధార్ కార్డుకు పూర్తి భద్రత లభిస్తుంది. 


అయితే ఆధార్ కార్డులో 12 అంకెలు ఉన్నట్టు మాస్క్‌డ్ ఆధార్ కార్డులో ఉండవు. ఈ మస్కాడ్ ఆధార్ లో కేవలం 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి. మిగతా 8 అకెంలను మాస్క్ ద్వారా కవర్ చేస్తుంది. ఇక్కడ కేవలం ఆధార్ నెంబర్‌పై మాత్రమే మాస్క్ ఉంటుంది. బయోమెట్రిక్స్, ఫోటోగ్రాఫ్, క్యూఆర్ కోడ్ వంటివి అలానే కనిపిస్తాయి. 


ఎయిర్ పోర్ట్, ట్రైన్ టికెట్ బుకింగ్ కి ఈ మాస్క్ డ్ ఆధార్ కార్డు ఐడెంటిఫికేషన్ కోసం ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఈ మాస్క్‌డ్ ఆధార్ కార్డు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, ఎల్‌పీజీ సబ్సిడీ, పెన్షన్ వంటి వాటికి కూడా ఉపయోగపడదు. కాగా ఈ మస్కాడ్ ఆధార్ కార్డు కావాలనుకునే వారు యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: