మీకు బైక్, స్కూటర్, కారు ఉన్నాయా.. తరచూ పెట్రోల్ వాడతారా.. అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే.. బడ్జెట్ కంట్రోల్ చేసుకోవాల్సిందే.. ఎందుకంటే ఎప్పుడైనా పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాలపై యుద్ధమేఘాలు కమ్ముకున్నందువల్ల ఆ ప్రభావం మనపై ఏ క్షణమైనా పడే అవకాశం ఉంది.

 

ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బాగ్దాద్ పై అమెరికా దాడి.. దాన్ని నిరసిస్తూ ఇరాన్ అమెరికాకు హెచ్చరిక పంపడం వంటి కారణాలతో ఎప్పుడైనా పెట్రోల్ రేట్లు పెరిగే ఛాన్సు కనిపిస్తోంది. ఎందుకంటే భారతే దేశం ఇరాన్ నుంచి దాదాపు 25 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటోంది.

 

ఇరాక్- అమెరికా యుద్ధవాతావరణం కారణంగా క్రూడాయిల్ బ్యారెల్ ధర ఒక్కరోజే నాలుగు శాతం వరకూ పెరిగింది. ఇది ముందు ముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల ఆ ప్రభావం భారత్ పై పడే ఛాన్సు చాలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: