క్రెడిట్ కార్డు.. నగరంలో నివసించే ప్రతి ఒక్కరికి ఇది ఉండాలి. ఈ కార్డు సాయంతోనే ప్రస్తుతం ఎందరో జీవితాలు. వచ్చే జీతాలు సరిపోక క్రెడిట్ కార్డు తీసుకొని ఉపయోగించి.. ఆ కార్డు బిల్లు కట్టలేక ఇబ్బంది పడడమే ప్రస్తుతం ఎంతోమంది యువకుల పని. ఇంకా దానికి ప్రధాన కారణం క్రెడిట్ కార్డు ప్రయోజనాలు తెలుసుకోకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.. 

 

ఇంకా క్యాష్‌బ్యాక్స్, డిస్కౌంట్లు, రివార్డు పాయింట్లు, ఇన్‌స్టంట్ క్రెడిట్, ఎక్స్‌క్లూజివ్ ఆఫర్స్ వంటి బెనిఫిట్ కారణంగా క్రెడిట్ కార్డుల వినియోగం ఎక్కువ పెరిగిపోతోంది. అయితే క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసే వారు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. అవి ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

క్రెడిట్ కార్డు తీసుకునే వారు సంవత్సరానికి మెయింటెనెన్స్ ఫీజు ఎంత అనేది తెలుసుకోవాలి.. ఎన్నో బ్యాంకులు ఉచిత క్రెడిట్ కార్డు అందిస్తున్నామని చెప్తాయి. అయితే అది కేవలం జాయినింగ్ ఫీజు, వార్షిక చార్జీలు తొలి ఏడాది ఉండవని దీని అర్థం. ఇంకా వార్షిక మెయింటెనెన్స్ ఫీజు మళ్లీ సంవత్సరం నుండి యధావిధిగా పడుతుంది. అందుకే ఫ్రీ అని తెలిసిన వెంటనే జాయిన్ అవ్వకుండా 
ఎంతకాలం ఫ్రీ అనేది తెలుసుకోండి. 

 

క్రెడిట్ కార్డుతో ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేస్తే ఎంత అదనపు చార్జీలు పడతాయి అనేది తెలుసుకోండి. అంతేకాదు వడ్డీ ఎంత పడుతుంది అనేది కూడా తెలుసుకోండి. 

 

మినిమమ్ బ్యాలెన్స్ చెల్లించకపోతే బ్యాంకులు లేట్ పేమెంట్ చార్జీలు విధిస్తాయి. అయితే దీని వల్ల క్రెడిట్ స్కోర్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. దీని వల్ల భవిష్యత్‌లో రుణం తీసుకోవడం కష్టంగా మారుతుంది. 

 

క్రెడిట్ కార్డుకు కూడా ఒక లిమిట్ ఉంటుంది. దాన్ని బట్టి కార్డు ద్వారా ఖర్చు చేయకూడదు. ఇంకా మీరు మీ క్రెడిట్ కార్డు లిమిట్‌కు మించి ఒక్క రూపాయి ఖర్చు చేసిన ఓవర్‌డ్రాయింగ్ చార్జీలు పడతాయి. 

 

క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు వడ్డీ, పన్నులు, ఇతర చార్జీల గురించి పూర్తిగా తెలుసుకొని తీసుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో లేని పోనీ ఇబ్బందులు వస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: