చాలా మందికి డబ్బులను ఎలా పెడితే లాభాలను పొందవచ్చు అనే అంశాలు తెలియక పోవచ్చు.. ప్రభుత్వ చట్టాల ద్వారా డబ్బులను ఆదా చేసుకోవచ్చునట.. విషయానికొస్తే.. ఆదాయపు పన్ను చట్టం లోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు. ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. సెక్షన్ 80సీ కింద పన్ను చెల్లింపు దారులు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు సొంతం చేసుకోవచ్చు.



ఈ సెక్షన్ లో పలు రకాల సెక్షన్లు కూడా ఉన్నాయని అంటున్నారు.సెక్షన్ 80 సీసీసీ, సెక్షన్ 80 సీసీడీ, సెక్షన్ సీసీఎఫ్, సెక్షన్ సీసీజీ వంటి వాటిని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ప్రావిడెంట్ ఫండ్, ట్యూషన్ ఫీజు ఇంటి కొనుగోలు, ఇంటి నిర్మాణం, 5 ఏళ్ల కాల పరిమితి లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి వాటి పై మీరు పన్ను మినహాయింపు పొందొచ్చు.. అవి ఎలానో చూద్దాం.. 



సెక్షన్ 80సీసీసీ.. ఆదాయపు పన్ను చట్టంలోని ఈ సబ్‌సెక్షన్ ద్వారా పన్ను మినహాయింపు పొందొచ్చు. పెన్షన్ ఫండ్స్‌పై దీని ద్వారా మినహాయింపునకు ఛాన్స్ ఉంటుంది.


సెక్షన్ 80సీసీడీ.. ఉద్యోగి కంట్రిబ్యూషన్‌తోపాటు ఉద్యోగి పని చేసే కంపెనీ కంట్రిబ్యూషన్ కూడా ఈ స్కీమ్స్‌కు ఉండాలి. అప్పుడు ట్యాక్స్ డిడక్షన్ లభిస్తుంది.



సెక్షన్ 80 సీసీఎఫ్ కింద కూడా పన్ను మినహాయింపు పొందొచ్చు. ప్రభుత్వం నోటిఫై చేసిన లాంగ్ టర్మ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్లలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. వీటి ద్వారా గరిష్టంగా రూ.20 వేల వరకు ట్యాక్స్ డిడక్షన్ లభిస్తుంది.



ఏడాదిలో రూ.25 వేల వరకు ట్యాక్స్ డిడక్షన్ సొంతం చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్ వంటి ఈక్విటీ సేవింగ్ స్కీమ్స్‌లో డబ్బులు పెడితే ఈ బెనిఫిట్ లభిస్తుంది. ఇన్వెస్ట్ చేసిన డబ్బుపై గరిష్టంగా 50 శాతం వరకు బెనిఫిట్స్ ను పొందవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: