అక్టోబర్ 30 ,2025 న హైదరాబాదులో ఈ జంట వివాహం ఇరువురు కుటుంబ సభ్యుల మధ్య చాలా గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో పాట, బాలకృష్ణ కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు కూడా హాజరయ్యి మరి ఈ జంటను ఆశీర్వదించారు. మరి నారా రోహిత్ ,శిరీష తల్లిదండ్రులు కాబోతున్నారు అనే విషయం పైన ఇంకా అధికారికంగా ప్రకటించలేదు ఈ జంట. ప్రస్తుతమైతే ఈ విషయం టాలీవుడ్ లో వైరల్ గా మారింది.
శిరీష విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా రెంటచింతల గ్రామానికి చెందిన అమ్మాయి. ఇమే చదువు ఆస్ట్రేలియాలో పూర్తి చేసింది. అక్కడ కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత సినిమాల పైన మక్కువ ఉండటంతో ఇండియాకి వచ్చి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి ప్రతినిధి 2 చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. నారా రోహిత్ 2009లో వచ్చిన బాణం సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత సోలో, ప్రతినిధి, అసుర తదితర చిత్రాలలో నటించారు నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో ప్రయోగాత్మక సినిమాలను తెరకెక్కించారు. ఇటీవల వరుస సినిమాలతో బిజీగా ఉన్న నారా రోహిత్ ఇప్పుడు తండ్రి కాబోతున్నారని తెలిసి నారా రోహిత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి