టాటాకు దక్కిన  స్థానం ఇదా ? !

రతన్ టాటా... ప్రపంచానికి పరిచయం అవసరం లోని పేరు. బారత దేశ సంపన్నుడు దిగ్గజ పారిశ్రామిక వేత్త.. ఆరు దశాబ్దాలుగా భారత దేశంలో పలుకుబడి కల్గిన వ్యక్తి. అన్నింటినీ మించి పరోపకారి. భారత్ లోని సంపన్నుల జాబితాలో ఆయన స్థానం మొదటిది అని చాలా మంది అనుకుంటుంటారు. ఇది కొన్నాళ్ల వరకూ నిజం కూడా. ఆయన పారిశ్రామిక వేత్త మాత్రమే కాని, వ్యాపార వేత్త కాదు. ఐఐఎఫ్ ఎల్ ఆనే సంస్థ భారత్ లోని సంపన్నుల జాబితా 2021ను విడుదల చేసింది. ఈజాబితాప్రకారం రతన్ టాటా స్థానం సంపన్నుల జాబితాలో ఎక్కడో వెనుకబడి ఉంది. ఆరు ధశాబ్దాలుగా తోలి పది మందిలోనో ఇరవై మందిలోనో ఉన్న టాటా ల స్థానం క్రిందకు జారింది.

ఇందుకు ప్రధాన కారణంటాటా సంస్థల ఆదాయం లో సింహ భాగం టాటా ట్రస్ట్ కు వెళుతుంది.  అంతే కాక లాభాలలో వాటా సంస్థ ఉద్యోగులు వెళుతుంది.  యజమానిగా ఆయనకు దక్కేది చాలా తక్కువ.  టాటా  ట్రస్ట్ చేసే  సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రతన్ టాటాకు   ప్రధాన ఆదాయ వనరు  టాటాసన్స్ సంస్థ. ఆ సంస్థ ఆస్తి విలువ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే.  దీంతో ఆయన స్థానం ఐఐఎఫ్ ఎల్ జాబితా ప్రకారం 433 స్థానం లోకి జారింది. ఆయన 2020 సంవత్సరంలో198 వ స్థానంలో ఉన్నారు. అప్పడు ఆయన ఆస్తి విలువ 6,000 కోట్లు. కరోనా సమయం  మానవాళికి పెద్ద ఎత్తున సాయం చేయడం వల్లనే అతని ఆస్తి తరిగి పోయిందని, ఫలితంగా  అతను సంపన్నుల జాబితాలో వెనుక పడ్డారని ఆర్థిక రంగ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఐఐఎఫ్ ఎల్ విడుదల చేసిన జాబితాలో ఎన్. రాధాకృష్ణారెడ్డి కుటుంబానికి చెందిన రైన్ ఇండ్రస్టీస్,  రాజోర్ఫీ కంపెనీ సహయజమానులు మాద్యూర్, శశాంక్ కుమా ర్ లు కూడా ఈయన స్థానంలోనే ఉండటం గమనార్హం.

టాటాన సామ్రాజ్యంలో ఉక్కు, మైనింగ్, హోటళ్లు, ఆటోమొబైల్ విభాగాలు, ఇలా 29 లిస్టెడ్ కంపెనీలున్నాయి. ఇవే కాక మరెన్నో లిస్టీంగ్ కాని కంపెనీలున్నాయి. వీటు సంపద విలువ 22.31,476.81 కోట్ల రూపాయలు. అయితే టాటా సంస్థల వ్యవస్థాపకుడు జెంషెడ్ జీ టాటా  ఆశయాలకు అనుగుణంగా రతన్ టాటా నడుచుకుంటారు.  ఫలితంగా టాటా సంస్థలలో రతన్ టాటా షేర్లు చాలా తక్కువ. ఫలితంగా రతన్ టాటా ఆదాయం కూడా తక్కు వే.   తమ సంపదను ఇతరులకు పంచే విషయంలోనూ, సేవా కార్యక్రమాల నిర్వహణలోనూ టాటా లే నంబర్ వన్. మూత పడే స్థితిలో ఉన్న ఎయిర్ ఇండియా సంస్థను ఉద్యోగులు సంక్షేమం కోసం తమ ఖాతాలో చేర్చుకున్న ఘనత కూడా టాటాలదే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: