చాలా ఈజీగా గృహ రుణ ఆమోదం పొందడానికి మీ క్రెడిట్ స్కోర్‌ను నిర్వహించండి. క్రెడిట్ స్కోర్ మీరు రుణాన్ని ఇంకా క్రెడిట్ డబ్బును తిరిగి చెల్లించడానికి ఎంత సిద్ధంగా ఉన్నారో తెలియజేస్తుంది. క్రెడిట్ స్కోర్ మీ లోన్స్ ఇంకా మీరు లోన్ ఈఎంఐ చెల్లిస్తున్న తీరు సహా అన్ని వివరాలను అందిస్తుంది. క్రెడిట్ స్కోర్ బాగుంటే వెంటనే గృహ రుణం మీకు లభిస్తుంది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే దాన్ని మీరు పెంచుకోవచ్చు. సకాలంలో చెల్లింపు చేయడం ద్వారా క్రెడిట్ స్కోర్‌ను చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇందులో క్రెడిట్ కార్డ్ చెల్లింపు నుండి విద్యుత్, నీరు ఇంకా అలాగే టెలిఫోన్ మొదలైన యుటిలిటీ బిల్లుల వరకు చెల్లించవచ్చు. ఇక అదే సమయంలో క్రెడిట్ వినియోగ నిష్పత్తిని తక్కువగా ఉంచే ప్రయత్నం కూడా చేయండి. అంటే మీరు క్రెడిట్ కార్డ్‌పై పరిమితిలో కొంత భాగాన్ని మాత్రమే ఖర్చు చేయాలన్నమాట. ఇక మీరు ఏదైనా రుణం తీసుకున్నట్లయితే దానిని వెంటనే తిరిగి చెల్లించడానికి ప్రయత్నించాలి. అప్పుడప్పుడు క్రెడిట్ రిపోర్ట్‌ని కూడా మీరు చెక్ చేస్తూ ఉండండి.


ఇక మీకు ఎక్కడ త్వరగా లోన్ లభిస్తుందో.. ఎక్కడ తక్కువ పేపర్ వర్క్ ఉంటుందో అక్కడి నుంచే లోన్ తీసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. చాలా బ్యాంకులు ఇంకా ఫైనాన్స్ కంపెనీలు ఈ విషయంలో పోటీని కలిగి ఉన్నాయి. చాలా స్పీడ్‌గా రుణాలను కూడా అందజేస్తాయి. చాలా వరకు బ్యాంకులు క్రెడిట్ స్కోర్ ఇంకా ఆదాయం మొదలైనవాటిని త్వరగా తనిఖీ చేసే వ్యవస్థను కలిగి ఉంటాయి. అటువంటి పైనాన్స్ కంపెనీలు ఇంకా బ్యాంకుల నుండి తక్షణ రుణాన్ని పొందే అవకాశం  ప్రీ-అప్రూవ్డ్ లోన్ పొందడం కూడా మీరు మార్గంగా చెప్పవచ్చు. మీ క్రెడిట్ స్కోర్ కనుక బాగుంటే.. ప్రీ-అప్రూవ్డ్ లోన్ పొందుతారు. దీనికి అసలు ఎలాంటి పత్రాలు అవసరం లేదు. రుణం తీసుకునే ముందు వివిధ బ్యాంకుల వడ్డీ రేటును కూడా ఒకసారి తనిఖీ చేయడం తప్పనిసరి. తక్కువ వడ్డీ రేటు లభించే చోట హోమ్ లోన్ ని తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: