తలసరి ఆదాయం అంటే ఒక దేశం లేదా రాష్ట్రంలో ఉన్న మొత్తం ఆదాయాన్ని ఆ ప్రాంతంలోని జనాభాతో భాగించగా వచ్చే సగటు ఆదాయం. ఈ సూచిక ద్వారా ప్రజల జీవన ప్రమాణం, ఆర్థిక స్థితి, అభివృద్ధి స్థాయి వంటి అంశాలను అంచనా వేయవచ్చు. సాధారణంగా ఒక ప్రాంతంలో తలసరి ఆదాయం పెరుగుతుందంటే అక్కడ ప్రజల కొనుగోలు శక్తి, ఉపాధి అవకాశాలు మరియు జీవన నాణ్యత మెరుగుపడుతున్నట్లు అర్థం.
తొలిసారిగా రూ. 3 లక్షల మార్క్ దాటిన గుజరాత్ తలసరి ఆదాయం:
గుజరాత్ రాష్ట్రం ఆర్థిక చరిత్రలో మరో కీలక మైలురాయిని నమోదు చేసింది. రాష్ట్ర తలసరి ఆదాయం తొలిసారిగా రూ. 3 లక్షల మార్క్‌ను దాటి రూ. 3,00,957కు చేరుకుంది. ఇది మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే కూడా ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ ఘనత గుజరాత్‌ను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలబెట్టింది.
టాప్–5 రాష్ట్ర ఆర్థిక వ్యవస్థల్లో గుజరాత్:
తాజా గణాంకాల ప్రకారం, 2023–24 ఆర్థిక సంవత్సరంలో గుజరాత్ రాష్ట్ర స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (ఘ్శ్డ్ఫ్) రూ. 24.62 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ స్థాయితో గుజరాత్ ఇప్పుడు భారతదేశంలోని ఐదు అతిపెద్ద రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా అవతరించింది.
ప్రస్తుతం గుజరాత్ కంటే ముందున్న రాష్ట్రాలు ఇవి: మహారాష్ట్ర..తమిళనాడు..ఉత్తరప్రదేశ్..కర్ణాటక.ఈ జాబితాలో గుజరాత్ తన స్థానం నిలబెట్టుకోవడం రాష్ట్ర ఆర్థిక బలానికి నిదర్శనం.
పదేళ్లలో అద్భుతమైన వృద్ధి:
2012–13 నుంచి 2023–24 మధ్య కాలంలో గుజరాత్ రాష్ట్రం సగటున 8.42 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది, ఇది ప్రధాన భారత రాష్ట్రాలలోనే అత్యధికంగా ఉండటం విశేషం. గత పదేళ్లలో పరిశ్రమలు, మౌలిక వసతులు, ఎగుమతులు, వ్యవసాయం, సేవా రంగం వంటి అనేక రంగాల్లో గుజరాత్ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో భారతదేశ మొత్తం స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదైంది. ఈ కాలంలో గుజరాత్ రాష్ట్రం ప్రత్యేకంగా బలమైన ఆర్థిక పనితీరును కనబరిచి దేశ ఆర్థిక వృద్ధికి కీలకంగా నిలిచింది.
“భారతదేశ వృద్ధికి ఇంజిన్”గా గుజరాత్:
ఈ నిరంతరమైన బలమైన ఆర్థిక వృద్ధి కారణంగా గుజరాత్ రాష్ట్రం ఇప్పుడు భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. పరిశ్రమలకు అనుకూల విధానాలు, పెట్టుబడిదారుల విశ్వాసం, ఉపాధి అవకాశాల విస్తరణ వల్ల గుజరాత్‌ను నేడు “భారతదేశ వృద్ధికి ఇంజిన్”గా పిలుస్తున్నారు. మొత్తంగా చూస్తే, గుజరాత్ రాష్ట్రం ఆర్థిక రంగంలో సాధిస్తున్న ఈ విజయాలు దేశ అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తూ, భవిష్యత్తులో మరింత వేగంగా ఎదగబోతున్న రాష్ట్రంగా నిలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి