కొంతమంది క్షణికావేశంలో ఏం చేస్తారో కూడా అర్థం కాదు. దీంతో చాలామంది తమ ప్రాణాలమీదకు తెచ్చు కుంటున్నారు. భార్య భర్తల మధ్య జరిగిన గొడవ  ఆమె 9 అంతస్తు నుంచి దూకేలా చేసింది. చివరకు తీవ్రమైన గాయాలతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తొమ్మిదో అంతస్తు నుంచి దూకే సమయంలో  ఆమెను  తన భర్త కొద్ది సేపటి దాకా తన చేతితో ఆపాడు. చివరికి జారిపోవడంతో  అక్కడ నుంచి కింద పడిపోయింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకున్నదో చూద్దామా.. వివరాల్లోకి వెళితే..?

 భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ కాస్త పెద్దదై హైడ్రామాకు దారితీసిందని చెప్పవచ్చు. దీంతో ఆమె 9వ అంతస్తు నుంచి  కిందకు దూకిన  ఆమె భర్త గట్టిగా పట్టుకుని కాపాడే ప్రయత్నం చేశాడు. ఇదంతా చూస్తూ నటువంటి స్థానికులు  టెన్షన్ తో భయపడిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని  ఘజియాబాద్ లో జరిగింది. ఇక్కడ విజయనగర ప్రాంతంలోని సేవియర్ సొసైటీలో సాదియా, ఫారజ్ హస్సన్ అనే ఇద్దరు దంపతులు నివసిస్తున్నారు. వీరు  తొమ్మిదో అంతస్తులోని ప్లాట్ లో ఉంటున్నారు.  వీరిమధ్య జరిగినటువంటి గొడవ చిలికి చిలికి పెద్ద గాలి వానలా తయారైంది. దీంతో  కోపం వచ్చినా ఆమె వేగంగా పరిగెత్తుకొని వెళ్లి  బాల్కనీ తలుపుతీసి అక్కడి  నుంచి వేగంగా దూకింది. వెంటనే ఆమె వెనకే వచ్చిన ఫారజ్. వెంటనే స్పందించి సాదియా యొక్క చేయి పట్టుకున్నాడు.  దీంతో ఆమె కింద పడకుండా కొద్దిసేపు ఆపాడు. ఆమె చెయ్యి పట్టుకుని ఆపిన ఫారజ్ పెద్దగా కేకలు చుట్టూ  పక్కల అందరిని పిలిచి అప్రమత్తం చేశాడు.

ఇది చూసినటువంటి చుట్టుపక్కల సొసైటీ స్థానికులు వెంటనే తమ తమ ఇళ్లలోని  దుప్పట్లు, పరుపులు, ఇతరాత్ర మెత్తని వస్తువులు  తీసుకువచ్చి  బిల్డింగ్ కింద పరిచారు. దాదాపు మూడు నిమిషాల పాటు  ఫారజ్ ఆమె చెయ్యి పట్టుకుని వదలలేదు. తర్వాత జారిపోవడంతో ఆమెను వదిలేశాడు. దీంతో 9 వ అంతస్తు నుంచి సాదియా కిందకు పడిపోయింది. అక్కడే ఉన్న మెత్తని పరుపులపై పడినప్పటికీ  ఆమెకు తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.  ఈ సీన్ మొత్తాన్ని సొసైటీలో ఉన్న వారు ఎవరో పూర్తిగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియా అంతా వైరల్ కావడంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: