నేటి సమాజంలో చాలా మంది క్షణివేశంతో ప్రాణాలు తీయడానికి, తీసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. ఇక అనుమానంతో ఒక్కరు, అక్రమ సంబంధాల కారణంగా మరొక్కరు భార్య చేతిలో భర్త, భర్త చేతిలో భార్య ప్రాణాలు కోల్పతున్నారు. పెంచి పెద్దచేసిం తల్లిదండ్రులను కాదనుకొని తాళి కట్టినా వాడితో జీవితం అనుకోని మెట్టినింట్లో అడుగుపెడతారు. ఇక నిండు నూరేళ్లు భార్యకు తోడుగా ఉంటాడనుకున్న భర్తే కాలయముడయ్యాడుగా మారుతున్నారు. అయితే అనుమానంతో భార్యను చున్నీతో హత్య చేసి నేరుగా పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన ఈ ఘటన కుంటాలలో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం అందకూర్‌ గ్రామానికి చెందిన కట్ట నిఖిల్‌ మండలకేంద్రంలో మూడేళ్లగా బైక్‌ మెకానిక్‌ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే నిఖిల్‌కు ఈ ఏడాది జనవరి 8న భైంసా మండలంలోని కామోల్‌ గ్రామానికి విజయ–గంగాధర్‌ దంపతుల కుమార్తె గౌతమి(18)తో పెళ్లి చేశారు. ఇక వీరు కుంటాలలోనే ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.

ఇక నిఖిల్‌ నిత్యం భార్యను అనుమానిస్తూ ఉండేవాడు. అయితే ఈ కారణంగా మంగళవారం ఇంట్లో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ తరుణంలోనే నిఖిల్‌ ఆమె గొంతుకు చున్నీ బిగించి నిఖిల్ హత్య చేసి చంపేశాడు. ఇక అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌ కు వెళ్లి నిఖిల్ లొంగిపోయారు. ఈ సంఘటన స్థలాన్ని భైంసా ఏఎస్పీ కిరణ్‌ ఖారే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

అయితే తహసీల్దార్‌ శ్రీధర్‌ మృతదేహానికి పంచనామా నిర్వహించారు. మృతురాలి కుటుంబసభ్యులు న్యాయం చేయాలని ఆందోళన గౌతమిని హత్య చేసిన నిఖిల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇక మృతురాలి బంధువులు, కామోల్‌ గ్రామస్తులు కల్లూర్‌–కుంటాల రహదారిపై ధర్నా చేశారు. అయితే సీఐ అజయ్‌బాబు సంఘటన స్థలానికి వెళ్లి మృతురాలి బంధువులకు నచ్చ జెప్పడంతో రాత్రిపూట ఆందోళన ఆపేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: