ప్రస్తుత సమాజంలో ఆడ మగ అనే తేడా చాలా వరకు పోయింది అని చెప్పవచ్చు. మహిళా మణులు ప్రత్యేక్షంగా రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆడవారు అంతరిక్షానికి కూడా పోతున్నారు. మగవాళ్లతో సమానంగా అన్ని పనుల్లో పోటీ పడుతున్నారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా వారు కూడా చేంజ్ అవుతున్నారు. కొంతమంది  ఆడవారు హత్యలు కూడా చేయడానికి వెనకాడటం లేదు. మానవత్వాన్ని మరిచి వారిలో ఉన్న మరో రూపాన్ని చూపిస్తున్నారు. హత్యలు మగవారే చేస్తారా మేము చేయలేమా అనె న్యూనత భావం కలిగిందో ఏమో ఈ  మహిళా మణి  కట్టుకున్న భర్తనే కాటికి పంపేసింది. చివరికి తానే చంపానని కూడా ధైర్యంగా ఒప్పుకుంది. మరి ఆమె తన భర్తను ఎందుకు చంపింది. వారి ఇద్దరి మధ్య ఏం  తేడా వచ్చింది. తెలుసుకుందాం. కాంతాకు వివాహమైంది తర్వాత తన భర్త చనిపోయాడు. ఒంటరిగా ఉంటున్న ఆమెను నాథుయాదవ్ అనే వ్యక్తి  ఆరు మాసాల ముందు  పెళ్లి చేసుకున్నాడు.

 రాజస్థాన్ రాష్ట్రంలోని ముంగేరి అనే గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటూ కాపురం పెట్టాడు.  అయితే యాదవ్ కూలిపని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ నాడు. ఈ సందర్భంలోనే ఓసారి  అత్తవారి ఇంటికి వెళ్ళిన కోడలు ఏవో చెప్పి తర్వాత కనిపించకుండా పోయింది. అదే ఈ సంఘటన లో టర్నింగ్ పాయింట్. ఏ భార్య అయినా తన భర్త మంచిగా ఉండాలని కోరుకుంటుంది. తన కుటుంబం  మంచిగా ఎదగాలని భావిస్తుంది. కానీ ఇక్కడ ఈమె వీటన్నిటికి విరుద్ధంగా ఉంది. దంగల్ పూర్ జిల్లాలోని జరిగిన ఈ సంఘటన అందరినీ షాక్ కు గురి చేసింది. ఫుల్లుగ తాగినా భార్య, భర్తను హతమార్చింది. వెంటనే తను అత్త దగ్గరికి వెళ్లి నేను మీ కుమారుడిని చంపేశానని ఇకపై నేను కూడా నీతోనే ఉంటానని చెప్పింది. దీంతో సదరు అత్తా మైండ్ బ్లాక్ అయిపోయింది. కోడలు అలా చెప్పినా 65 సంవత్సరాల అత్తగారు నమ్మలేక పోయారు. ఏదో నన్ను భయపెట్టడానికి అలా మాట్లాడుతుంది అనుకుంది. నాలుగు రోజులు గడిచింది. ఇంటి పక్కన కుళ్లిపోయిన వాసన రావడంతో  వారంతా కలిసి కాంతకు ఫోన్ చేశారు . ఆ ఫోను వారి అత్తగారికి ఇచ్చి మాట్లాడమని చెప్పింది. అప్పుడు మొదలైంది డౌట్ అత్తకు. వెంటనే పరుగుపరుగున వెళ్లి అద్దె ఇంటి తాళం తెరిచి చూడగా ఆ ఇంటి లోపల తన యొక్క కొడుకు శవం కుళ్ళి పోయి భరించలేనంత వాసన వచ్చింది. వెంటనే ఆమె తలుపులు మూసి  పోలీసులకు సమాచారం అందించింది. తన కొడుకును  చంపిందని కంప్లైంట్ కూడా ఇచ్చింది. అయితే కాంతా అప్పటికే వివాహం అయింది కాబట్టి ఆమె తన కొడుకును చేసుకోవడం అత్త గారికి ఇష్టం లేదు. అందుకే కోడలు నా ఇంట్లో ఉండడానికి వీలు లేదని చెప్పి బయటకు పంపించింది. తల్లికి ఎదురు జవాబు ఇవ్వలేని నాథ్ యాదవ్ వేరే  దగ్గర గది అద్దెకు తీసుకొని అక్కడే ఉంటాడు. అయితే అత్త మందగించిందని మనసులో పెట్టుకున్న కాంత తనకు అవమానం జరిగినట్లు ఫీల్ అయిపోయింది.

ఈ విషయంపై ప్రతిరోజు తన భర్తతో గొడవ కూడా పెట్టుకునేది. మద్యం సేవించడం కూడా అలవాటు చేసుకుంది. రోజురోజుకు అత్త  పై కోపం పెంచుకుంది. ఓ రోజు బాగా తాగి వచ్చి తన భర్తను చంపేసింది. మళ్లీ అత్త వారి ఇంటికి వెళ్లి ఈ విషయం చెప్పినా అత్త నమ్మలేదు. చివరికి అత్త కు తెలిసిన తర్వాత పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది అత్త. ఈ విషయాన్ని గమనించిన కాంతా ఇంట్లో నుంచి పారిపోయింది. దీంతో యాదవ్ శవాన్ని చాలా ఇబ్బందులతో ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: