అనుమానం.. ఇది ఎవరి జీవితంలో కైనా ఎంట్రీ ఇచ్చింది అంటే చాలా దారుణం ఘటనలకు కారణం అవుతుంది. మనిషి ప్రశాంతతను దూరం చేస్తుంది.  సొంత వాళ్లని శత్రువులుగా మార్చేస్తుంది. చివరికి ఉన్మాదిగా మారి పోయేలా చేస్తుంది. ఇలా ఇటీవలి కాలంలో ఎన్నో బంధాలలో అనుమానం కారణంగా చివరికి హత్యలు ఆత్మహత్యలు జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న ఓ యువకుడు చివరికి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది.


 ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ కి చెందిన శివం చౌహాన్ ఢిల్లీలోని కిషన్ ఘడ్ కు చెందిన యువతితో నాలుగేళ్లుగా ఉన్నాడు. ఇక వీరిద్దరూ ఏకాంతంగా గడిపేందుకు ఢిల్లీలోని హోటల్ కి వచ్చారు. ఇంతలో ప్రియురాలికి ఒక ఫోన్ వచ్చింది. ఎవరు ఫోన్ చేశారు అని శివం అడిగాడు.. మా చెల్లెలు లవర్ ఫోన్ చేసాడు అంటూ చెప్పింది యువతి. ఇక ప్రియురాలిపై ఒక్కసారిగా అనుమానం వచ్చేసింది. నిజం చెప్పు ఎవరు ఫోన్ చేశారు అంటూ మరోసారి అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం ప్రారంభమైంది.


 ఇక తీవ్ర ఆవేశంతో ఊగి పోయినా శివం ప్రియురాలి తలను గోడకేసి కొట్టాడు. దెబ్బలకు తాళలేక పోయిన యువతి అక్కడికక్కడే చని పోయింది.. మర్నాడు ఉదయం శివం ఒక్కడే రూమ్ లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. తర్వాత అక్కడి సిబ్బంది రూమ్ లో యువతి శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.  సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని పంపించారు. ఈ క్రమంలోనే శివం చౌహాన్ ను అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోశారు. పోలీసులు. వేరే వ్యక్తితో  సంబంధం పెట్టుకొని  నన్ను మోసం చేసిందని ప్రియురాలిని హత్య చేసాను అంటూ  పోలీసు విచారణలో అంగీకరించాడు శివం.

మరింత సమాచారం తెలుసుకోండి: