ఇటీవల కాలంలో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్న ఘటనలు ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ప్రేమోన్మాదులు ఏకంగా ప్రేమించిన వారి పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు ప్రతి ఒక్కరు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లాలో ఒక ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఏకంగా ప్రేమకు అంగీకరించడం లేదని మైనర్ బాలికపై దాడి చేసి దారుణంగా గొంతుకోశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి లో వెలుగులోకి వచ్చింది.


 ఈ ఘటన జిల్లా వ్యాప్తం గా సంచలనం గా మారిపోయింది. అయితే ఈ ఘటన గురించి మరవకముందే నెల్లూరులో మరో దారుణం వెలుగుచూసింది. ఓ యువతి తన మాజీ ప్రియుడిని ఇంటికి పిలిపించి కారుతో ఢీ కొట్టి దారుణంగా హత్య చేయాలని ప్రయత్నించిన ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న నజీర్ అనే యువకుడు అక్కడే స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న ఆసిఫాతో గత కొంత కాలం నుంచి ప్రేమలో ఉన్నాడు. అయితే ఇటీవలే అసిఫా కు అబ్దుల్ రెహమాన్ అనే యువకుడితో పెళ్ళి నిశ్చయించారు. ఈ క్రమంలోనే నజీర్ సెల్ఫోన్లో ఉన్న తన ఫోటోలను చాటింగ్ లను డిలేట్ చేయాలని భావించిన అసిఫా అతని ఇంటికి పిలిపించింది.


 ఈ క్రమం లోనే కాబోయే భర్త అబ్దుల్ రెహమాన్ తో కలిసి ఇక ప్రియుడు నజీర్ ను హత మార్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమం లోనే కారు తో అతని ఢీ కొట్టింది. ఈ ఘటన లో తీవ్ర గాయాల పాలైన నజీర్ ను స్థానికులు రక్షించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమం  లోనే ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు నజీర్. ఘటనపై ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు. ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: