విధి ఆడిన వింత నాటకంలో మనిషి జీవితం ఒక కీలుబొమ్మ లాంటిది. అందుకే మనిషి జీవితంలో మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుంది అన్నది కూడా ఊహకందని విధంగానే ఉంటుంది. అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని ఘటనలు మృత్యువు ఒడిలోకి నెడుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. స్కూల్ విద్యనభ్యసిస్తున్న ఆ విద్యార్థికి అప్పుడే నిండు నూరేళ్ళు నిండిపోయాయి.


 ప్రతి రోజు స్నేహితులతో కలిసి ఆడుతూ పాడుతూ స్కూలుకు వెళ్లి వస్తున్న బాలుడి ఆనందాన్ని చూసి విధి ఓర్వ లేక పోయింది. చివరికి ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. స్కూల్ బస్సు కిటికీలోంచి బయటకు చూస్తున్న విద్యార్థి తల స్తంభానికి తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మోతీ నగర్ టౌన్ లో ఉండే ఓ ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థి బుధవారం ఉదయం సమయంలో స్కూల్  బస్సులో బయలుదేరాడు.


 ఈ క్రమంలోనే చల్లటి గాలిని ఆస్వాదించేందుకు బస్సు కిటికీ తెరిచి తలను బయటపెట్టాడు. అంతలోనే సడన్ గా కరెంట్ పోల్ తగిలింది. దీంతో తీవ్ర గాయాలయ్యాయి వెంటనే చిన్నారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఈ ఘటన తర్వాత విద్యార్తి తల్లిదండ్రులను పిలిచిన  పాఠశాల యాజమాన్యం బాలుడి ఆరోగ్యం బాగాలేదని వాంతులు చేరుకునేందుకు బస్సు బయటకి తలపెట్టాడని కరెంట్ పోల్ తగిలింది అని చెప్పారు. అయితే స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తన కుమారుడు చనిపోయాడని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు.  యాజమాన్యం తమ కుమారుడి ఆరోగ్యం బాలేదు అని చెబుతుంది అంత అవాస్తవం అంటూ ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: