
ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఎంతోమంది చెల్లి కోరికను తీర్చుతూ ఎంతో విలువైన బహుమతులు కూడా ఇస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా రక్షాబంధన్ అతన్ని నేరస్థుడిని చేసింది. చెల్లి ని సర్ ప్రైజ్ చేస్తూ ఒక విలువైన గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాడు అన్న. దీనికోసం చివరికి నేరస్థుడిగా మారిపోయాడు. ఇక ఇటీవల అతని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని విచారించగా షాకింగ్ విషయాలు చెప్పడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. చెల్లికి రక్షాబంధన్ రోజు ఎలక్ట్రికల్ స్కూటర్ గిఫ్ట్ గా ఇవ్వాలని ఇక ఇలా నేరాలకు పాల్పడినట్లు చెప్పుకొచ్చాడు.
సుల్తాన్ పురి పోలీస్ స్టేషన్లో జూలై 7వ తేదీన కంప్లైంట్ రావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అయితే తరుణ్ అనే వ్యక్తి దొంగతనం చేయబోయి విఫలం అయ్యాడు అనే విషయం తేలింది.. ఇక అక్కడి నుంచి పారిపోయే క్రమంలో అతను ఫోన్ అక్కడే పడి పోయింది. ఇక నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. రోహిణి ప్రాంతంలో ఉండే 21 ఏళ్ల తరుణ్ బైక్ తో పాటు మొబైల్ ఫోన్స్ దొంగలు ఇస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలు చేసేందుకు దొంగతనాలకు పాల్పడినట్లు నిందితుడు తెలిపాడట. రాఖీ పండుగకు గిఫ్ట్ గా తన చెల్లికి టూవీలర్ ఇవ్వాలనుకున్నట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. అయితే ఇప్పటికే అతనిపై ఆరు కేసులు ఉన్నాయన్న విషయం కూడా పోలీసులు గుర్తించారు.