పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది . ఈ క్రమంలోనే  తమకు నచ్చిన అమ్మాయినిచూసి పెళ్లి చేసుకోవాలని అబ్బాయిలు.. రాజకుమారుడు లాంటి వరుడు వస్తే బాగుండు అనే అమ్మాయిలు కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాము పెళ్లి చేసుకోబోయే వారి విషయంలో ఎన్నో కలలు కంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కాగా వెనక ముందు అన్ని చూసుకుని ఇక పెళ్లి బంధంలోకి అడుగు పెడుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత దాంపత్య జీవితాన్ని ఎంతో హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఏకంగా ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం.. ఇద్దరు అమ్మాయిలు వివాహబంధంతో ఒక్కటవ్వడం లాంటి ఘటనలు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి.


 ఇటీవల ఇలాంటి తరహా ఘటనలు తరచూ సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఇటీవల వైఎస్ఆర్ జిల్లాలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేసింది. ఏకంగా ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. దీంతో తల్లిదండ్రులు చేసేదేమీలేక పోలీసులను ఆశ్రయించగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు ఎవరి ఇళ్లకు వారిని పంపించేశారు. కమలాపురం నియోజకవర్గం చెన్నూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు పెండ్లిమర్రి మండలం మిట్టమీద పల్లి కి చెందిన ఓ వ్యక్తితో గత ఏడాది కిందట వివాహం జరిగింది.


 అయితే గత కొన్ని రోజుల నుంచి వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో సదరు మహిళకు తన బంధువైన వేంపల్లె రాజీవ్ కాలనీకి చెందిన మరో మహిళతో పరిచయం ఏర్పడింది.  పరిచయం కాస్త ప్రేమగా మారి పోయింది.  దీంతో సభ్యసమాజం ఏమనుకున్నా పర్వాలేదు అనుకుని భావించి వీరిద్దరూ రహస్యంగా శ్రీకాళహస్తిలో వివాహం చేసుకున్నారు. ఇటీవలే వేంపల్లె పోలీస్ స్టేషన్కు చేరుకుని తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను కోరారు. ఇక పోలీసులు ఒక్కసారిగా వారిని చూసి అవాక్కయ్యారు. వెంటనే వారి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్కు పిలిపించి వారి సమక్షం లోనే ఆ ఇద్దరు మహిళలకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: