
రక్తం పంచుకుని పుట్టిన పిల్లల విషయంలో కూడా కాస్తయినా జాలి దయ చూపించడం లేదు అని చెప్పాలి. వెరసి నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే నేటి సభ్య సమాజంలో మానవతా విలువలు లేకుండా పోయాయని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. యూపీలోని ఘజియాబాద్ ఒక మహిళ అక్రమ సంబంధం గురించి భర్తకు తెలిసిపోయిందని భావించి దారుణానికి ఒడిగట్టింది. బకర్వా గ్రామానికి చెందిన సునీల్, దీప భార్య భర్తలు.
సంసారం ఎంతో సాఫీగా సాగి పోతూ ఉండేది. కానీ గత పదేళ్లుగా రవి అనే వ్యక్తి దీప తో ఎఫైర్ను కొనసాగిస్తూ వస్తున్నాడు. భర్త సునీల్ కు తెలియకుండా ఈ విషయం ఎంతో రహస్యంగానే మెయింటెయిన్ చేసింది. కానీ ఇటీవలే భర్తకు భార్య అక్రమ సంబంధం గురించి తెలిసి భార్యను హెచ్చరించాడు సునీల్. కానీ భర్త కంటే ప్రియుడే ముఖ్యం అనుకున్న సదరు మహిళ ఇటీవలే భర్తను ఖర్చుచేసి గోని సంచిలో పెట్టి పొలాల్లో పడేసింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.