
ఇంతకీ వీళ్ళ ప్రేమ గురించి తెలిసి అందరూ ఎందుకు అవాక్కవుతున్నారు. అంతలా షాక్ అవ్వడానికి వీరి ప్రేమలో విచిత్రం ఏముంది అని అనుకుంటున్నారు కదా. ఇక అదంతా తెలియాలంటే మాత్రం వీరి లవ్ స్టోరీ లోకి వెళ్లాల్సిందే ఇటీవలే ఒక రిటైర్డ్ అయిన ఉన్నతాధికారి కనిపించడం లేదని ఆయన భార్య వరంగల్ నగరంలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఇంకోవైపు నుంచి తమ కుమార్తె కనిపించడం లేదంటూ మరో మహిళా ఉద్యోగి కుటుంబం మహబూబాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇక ఆ తర్వాత పోలీసులు వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు పట్టుకున్నారు.
ఇక పోలీస్ విచారణలో భాగంగా ఆ రిటైర్డ్ ఉద్యోగి ఆ యువతి చెప్పిన విషయాలు విని అందరూ షాక్ అయ్యారు అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే మహబూబాబాద్ గ్రామీణ నీటి సరఫరా విభాగంలో సూపరిండెంట్ ఇంజనీర్ గా పనిచేసే రిటైర్డ్ అయిన ఒక పెద్దాయన లేటు వయసులో ఘాటు ప్రేమలో పడ్డారు. ఆయనకు శిక్షణ విభాగంలో ఓ యువతి పరిచయమైంది. అయితే ఇలా పరిచయమైన మహిళకూ గతంలోనే వివాహం జరిగింది. పెల్లు ఇష్టం లేక ఇబ్బందులు పడుతుంది అయితే 10 రోజుల క్రితం ఆఫీస్ వెళ్తున్నానని చెప్పి మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు భర్త ఆమె కనిపించట్లేదు అన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు. చివరికి ఒకరోజు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇక వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అను విషయం బయటపడింది. ఈ కేసును ఎలా ముగించాలో తెలియక పోలీసులు కూడా తలలు పట్టుకున్నారు చివరికి రెండు కుటుంబాలను కూర్చొని ఒక నిర్ణయానికి రావాలని ఇక వాళ్లకే తుది నిర్ణయం వదిలేసినట్లు తెలుస్తోంది..