
సమయాను గుణంగా ఊసరవెల్లి కంటే దారుణంగా రంగులు మారుస్తూన్న మనిషి మానవత్వం అనే పదాన్ని మరిచిపోతున్నాడు. ఇలా క్షణికావేశంలో చాక్లెట్ తిన్నంత ఈజీగా ఎదుటివారి ప్రాణాలను తీసేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటనే వెలుగులోకి వచ్చి అందరిని ఉలిక్కిపడేలా చేసింది. సాధారణంగా పెళ్లి అనేది నూరేళ్లపంట అని అంటూ ఉంటారు. కానీ ఇక అలాంటి పెళ్లిలోనే రక్తపాతం జరిగింది. చివరికి ఒక దారుణ హత్యకు కారణమైంది అని చెప్పాలి. సాధారణంగా పెళ్లిళ్లలో విందు భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు ఎన్నో రకాల ఐటమ్స్ పెడుతూ ఉంటారు.
ఇక ఇలాంటి వాటిలో కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని రకాల ఆహార పదార్థాలు తక్కువ అవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. అయితే పెళ్లి భోజనాలలో రసగుల్లా స్వీట్ కోసం తలెత్తిన వివాదం కాస్త చివరికి ఒకరు ప్రాణం తీసింది. ఉత్తరప్రదేశ్ లోని ఎత్మాదుపూరులో నివసిస్తున్న ఉస్మాన్ ఇంట్లో వివాహం జరుగుతుండగా భోజన సమయంలో రసగుల్లా తక్కువైంది. దీంతో పెళ్లికొడుకు పెళ్ళికూతురు బంధువుల మధ్య గొడవ జరిగింది. కోపంతో ఒక వ్యక్తి కత్తితో దాడి చేయగా ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.