ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఈ సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాల అన్నది కూడా అర్థం కాని విధంగా మారిపోయింది. ఎందుకంటే ఎదుటి వ్యక్తికి ఏదైనా అపాయం వస్తే అయ్యో పాపం అంటూ జాలి పడాల్సిన మనుషులు కాస్త కారణం  లేకుండానే సాటి మనుషుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఇలాంటి కారణాలకు కూడా హత్యలకు పాల్పడతారా అని ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు.


 అంతేకాదు ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా కూడా ఎవరైనా దాడి చేసి చంపేస్తారేమో అనే భయంతోనే ప్రతి క్షణం భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి కూడా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఏర్పడుతుంది  అని చెప్పాలి. అయితే కేవలం పరాయి వాళ్ళ విషయంలోనే కాదు సొంత వాళ్ళ విషయంలో కూడా జాలీ దయ అనే విషయాన్ని మరిచిపోతున్న మనుషులు కర్కషంగా వ్యవహరిస్తున్నారు. చాక్లెట్ తిన్నంత ఈజీగా ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. ఆ తర్వాత జైలు శిక్ష అనుభవిస్తున్నారు అని చెప్పాలి.


 ఇక ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన అయితే మరింత దారుణమైనది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే వైఫై పాస్వర్డ్ చెప్పలేదు అన్న కారణంగా యువకుడిని దారుణంగా హత్య చేశారు. ముంబైలోని కమోతే ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వైఫై హాట్స్పాట్ పాస్వర్డ్ చెప్పాలని కోరగా.. 17 ఏళ్ల బాలుడు మాత్రం చెప్పేందుకు నిరాకరించాడు. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఊగిపోయిన ఇద్దరు యువకులు తమ దగ్గర ఉన్న కత్తులతో అతనిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. అనంతరం రక్తపు మడుగులో 17 ఏళ్ల బాలుడు పడిపోగా అక్కడి నుంచి పరారయ్యారు నిందితులు. ఇక వెంటనే స్థానికులు అతని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: