
ఇంకొంతమంది ఏదో చిన్న ప్రాబ్లంతో ఆసుపత్రికి వెళ్తే సినిమాల తరహాలోనే ఏకంగా శరీరంలోని అవయవాలను మాయం చేస్తున్న ఘటనలు కూడా అందరిని అవాక్కయ్యలా చేస్తూ ఉన్నాయి. ఇక ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఒంట్లో నలతగా ఉంది అని ఒక వ్యక్తి ఆస్పత్రికి వెళ్తే ఏకంగా అతనికి ఆపరేషన్ చేసిన వైద్యులు కిడ్నీలు మాయం చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. ముందుగా కిడ్నీలో రాళ్లు పడ్డాయని చెప్పిన వైద్యులు ఆపరేషన్ చేశారు. కొంతకాలానికి అతనికి విపరీతమైన కడుపునొప్పి రావడంతో మరోసారి ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకుని చూడగానే ఒక్కసారిగా కంగుతున్నాడు.
మొదట ఆపరేషన్ చేసిన వైద్యులు కిడ్నీలో రాళ్ళను కాదు ఏకంగా కిడ్నీలనే లేపేసారు అన్న విషయం అతనికి అర్థమైంది. ఈ ఘటన కాస్ గంజ్ జిల్లాలో వెలుగు చూసింది. సురేష్ చంద్ర అనే వ్యక్తి పోలీస్ శాఖలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఇటీవల విపరీతమైన బ్యాక్ పెయిన్ రావడంతో హాస్పిటల్ కి వెళ్ళాడు. అక్కడ వైద్యులు కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు తెలిపారు. వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించారు. దీంతో అతను కూడా వెంటనే అలీగడ్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాడు. కొన్నాళ్లకు కడుపు నొప్పి రావడంతో వేరే ఆసుపత్రికి వెళ్లి స్కానింగ్ తీసుకొని చూడగా కిడ్నీలు లేవు అన్న విషయాన్ని గుర్తించాడు. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించాడు సురేష్ చంద్ర.