దేవుడు ప్రతి ఒక్కరికి ప్రాణం పోస్తే ఇక ఆ ప్రాణానికి ఎలాంటి ఆటంకం వచ్చిన ఇక పునర్జన్మను ప్రసాదించేది మాత్రం వైద్యులు మాత్రమే అన్నది అందరికీ తెలిసిన నిజం. ఎందుకంటే ప్రాణాలు పోతున్న పట్టించుకోని పరిస్థితి ఉన్న నేటి రోజుల్లో ఏకంగా వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరి ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతూ ఉంటారు. అయితే ఇదంతా కేవలం వట్టిమాటలే అని కొంతమంది కొట్టి పారేసిన కరోనా వైరస్ సమయంలో మాత్రం వైద్యుల విలువ ఏంటి అన్నది అందరికీ తెలిసి వచ్చింది అని చెప్పాలి. ఇలా అత్యున్నతమైన వైద్యవృత్తిలో కొనసాగుతూ ఇక ఎంతోమందికి సేవ చేయాల్సిన వైద్యులు.. కొన్ని కొన్ని సార్లు నీచమైన పనులు చేస్తూ అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి తరహా ఘటన ఇటీవల విజయవాడలో కూడా ఒకటి వెలుగు చూసింది. గాంధీనగర్ లో నివాసం ఉంటున్న ఆర్ఎంపీ డాక్టర్ రాధిక వైద్య వృత్తిని అడ్డుపెట్టుకుని ఏకంగా వ్యభిచార గృహాన్ని నడుపుతూ అమ్మాయిల జీవితాన్ని నాశనం చేయడం చేస్తుంది. ఇక ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అందరూ ఇక ఆర్ఎంపీ డాక్టర్ రాధిక గురించి తెలిసి షాక్ అవుతున్నారు.


 గాంధీనగర్ లో రాధిక భర్త ఆర్ఎంపీ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన ఎంతో మంది ప్రజలకు సహాయం చేసి కరోనా వైరస్ సమయంలో ప్రాణాలు వదిలారు అని చెప్పాలి. ఇక భర్త లాగే ఆమె కూడా ఆర్ఎంపీ డాక్టర్ గా కొనసాగుతూ ఉంది. ఇక భర్త మంచి పనుల నేపథ్యంలో ఆమెకు కూడా ప్రజల్లో మంచి నమ్మకం ఉంది. ఇక ఈ నమ్మకాన్నే తాను క్యాష్ చేసుకోవాలని ప్రయత్నించింది. ఈ క్రమంలోనే అమ్మాయిలను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి పెద్ద ఎత్తున వ్యభిచార గృహాలని నడపడం మొదలు పెట్టింది.  డాక్టర్గా ఫోజులు ఇస్తూ లోలోపల మాత్రం వ్యభిచారం నడిపిస్తు ఎంతో మంది అమ్మాయిలు జీవితాలను నాశనం చేసింది.


 అయితే ఆమె వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన స్థానికులు ఇక ఈమెపై ఒక కన్నేసారు.  ఈ క్రమంలోనే ఓ కుర్రాడు రాధిక గుట్టు రట్టు చేసేందుకు  పదివేల రూపాయలు చెల్లించి మరి ఒక అమ్మాయిని బుక్ చేసుకున్నాడు.. ఇక ఇలా డబ్బులు తీసుకున్న తర్వాత ఆ కుర్రాడుని అమ్మాయి గదిలోకి పంపించారు. ఇక అప్పటికే పోలీసులకు సమాచారం అందించిన యువకుడు ఇక అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని మొత్తాన్ని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు కళ్ళకు కట్టినట్లు చూపించాడు. దీంతో చివరికి ఆర్ఎంపీ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న రాధికను అరెస్టు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: