
ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. సాధారణంగా తండ్రి అంటే ఒకవైపు కట్టుకున్న భార్యకు ఏ కష్టం రాకుండా చూసుకోవడమే కాదు ఇక పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండాలి. ఇంటి బాధ్యతను చూసుకుంటూ ఎంతో హుందాగా ప్రవర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా రెండేళ్ల కొడుకును దారుణంగా మొదటి అంతస్తు నుంచి కింద పడేయడమే కాదు మూడవ అంతస్తు నుంచి అతను కూడా దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 30 ఏళ్ల సింగ్, పూజా భార్యాభర్తలు. ఇద్దరి మధ్య మొదటి నుంచి సఖ్యత లేదు అని చెప్పాలి.
గొడవలు జరుగుతూ ఉండడంతో భర్త తీరుపై విసుగు చెందిన పూజ ఇటీవల తన ఇద్దరు పిల్లలను తీసుకుని అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఇక అటు భర్త సింగ్ కూడా భార్య వద్దకు వెళ్లలేదు. కనీసం మాట్లాడలేదు. అయితే ఇటీవల ఫుల్లుగా మద్యం తాగిన సింగ్ భార్య వద్దకు వెళ్లాడు. అయితే చాన్నాళ్ల తర్వాత భర్త రావడంతో ఎంతో సంతోష పడింది భార్య. కానీ అతని మనసులో ఉన్న నీచమైన ఆలోచనను మాత్రం ఊహించలేకపోయింది. ఇక పూజతో గొడవ పడిన సింగ్ అకస్మాత్తుగా తన రెండేళ్ల కుమారుడిని తీసుకొని మొదటి అంతస్తు నుంచి చిన్నారిని కిందకు విసిరేసాడు. ఆ తర్వాత మూడో అంతస్తుకు వెళ్లి అతను కూడా కిందకు దూకేశాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారూ. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.