
ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవకు చెందినదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా ప్రతిరోజు ఒక ఎగ్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అన్న విషయం అందరికీ తెలుసు. చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతిరోజు ఒక గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అయితే ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే గుడ్డు కూడా చివరికి మనిషి ప్రాణాలను తీసేస్తుంది అన్నదానికి నిదర్శంగా ఇక్కడ జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా ఉడక పెట్టిన గుడ్డు నోట్లో ఇరుక్కుని ఒక వ్యక్తి చనిపోయాడు.
ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఓ హోమ్ కు చెందిన అంజి అనే 51 ఏళ్ళ వ్యక్తి మానసిక రోగి. హైదరాబాదులోనే ఎర్రగడ్డ హాస్పిటల్లో డిసి వార్డులో చికిత్స తీసుకుంటున్నాడు. కాగా పెంకు తీయకుండానే ఉడకబెట్టిన గుడ్డును నోట్లో పెట్టుకొని తినేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ గుడ్డు గొంతులో ఇరుక్కుని ఊపిరాడక ఎంతగానో ఇబ్బంది పడ్డాడు. ఇలా చూస్తుండగానే చివరికి ప్రాణాలు కోల్పోయాడు అని చెప్పాలి. అయితే గుడ్డు గొంతులో ఇరుక్కుపోవడం కారణంగా చనిపోలేదని అతనిది సహజ మరణమే అంటూ హాస్పిటల్స్ సూపరిండెంట్ చెప్పడం గమనార్హం .