ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన ఎంతోమంది భక్తులు అయ్యప్ప ధరించి ఏకంగా 40 రోజుల పాటు ఎంతో నిష్టగా దీక్ష చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. దీంతో ఎక్కడ చూసినా అయ్యప్ప స్వాములే దర్శనమిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు అయ్యప్ప స్వామిని ఎంతో భక్తితో కొలుస్తూ ఉన్నారు అని చెప్పాలి. సాధారణంగా అయ్యప్ప మాల ధరించిన వారు భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం..  ఎప్పుడూ దైవచింతనలోనే ఉండడం.. ఇక అయ్యప్ప స్మరణ చేస్తూ ఉండడం కనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం అయ్యప్ప మాల ముసుగులో చేయకూడని పనులను చేసేస్తున్నారు.


 ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటిదే చేసి చివరికి పోలీసులకు చిక్కాడు అని చెప్పాలి. ఇతరులకు అనుమానం కలుగుకుండా పవిత్రమైన అయ్యప్ప మాల ధరించినట్లుగా నటిస్తూ గురుస్వామి ఇంటికే కన్నం వేశాడు ఇక్కడ ఒక పాత నేరస్థుడు.  ఈ ఘటన నిజాంబాద్ నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. చంద్రశేఖర్ కాలనీకి చెందిన యువకుడు బచ్చల నాగరాజు ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం నగర శివారులో ఉన్న గోపన్ పల్లి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల అయ్యప్ప మాల ధరించిన నాగరాజు అదే గ్రామానికి చెందిన గురుస్వామి చిన్నబోయిన సత్యనారాయణ ఇంట్లో ఉంటున్నాడు.


 ఇటీవలే గురు స్వామి సత్యనారాయణ బీరువాని తెరిచి చూడగా 8.5 తులాల నగలు లక్ష రూపాయల నగదు కనిపించకుండా పోయింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు గోపన్పల్లి  పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించగా.. చివరికి దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. అయితే నిందితుడి పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు అని చెప్పాలి. ఇక అతని నుంచి 8 తులాల బంగారం లక్ష రూపాయల నగదు రికవరీ చేసినట్లు వెల్లడించారు. అయితే నిందితుడు పాత నేరస్తుడని అతనిపై పలు నేరాల్లో ఇప్పటికి కేసులు నమోదు అయ్యాయని  పోలీసులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: