కరోనా వైరస్ సమయంలో వైద్యులు అంటే చాలు ప్రత్యక్ష దైవాలుగా మారిపోయారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలు మూతపడిన నేపథ్యంలో తమ కష్టాలు చెప్పుకునేందుకు కనీసం దేవుడి దగ్గరికి కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో ఇక డాక్టర్లే ప్రత్యక్ష దైవాలుగా మారిపోయి తమ ప్రాణాలను పణంగా పెట్టి మరి ప్రజల ప్రాణాలను రక్షించారు. ఈ పోరాటంలో ఎంతో మంది వైద్యులు సైతం చివరికి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే.


 ఇలా కరోనా వైరస్ సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అటు డాక్టర్లు చూపిన తెగువ చూసిన తర్వాత ఇక ప్రత్యక్ష దైవం ఎక్కడో లేదు తెల్ల పోటు వేసుకున్న వైద్యుడు రూపంలోనే ఉన్నాడు అంటూ ఎంతోమంది నమ్మడం మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో కొంతమంది వైద్యులు మాత్రం ఏకంగా వైద్య వృత్తికి కళంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారూ అని చెప్పాలి. ఎంతో నమ్మకంతో డాక్టర్ల దగ్గరికి వచ్చిన పేషంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.


 చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్వాకం అందరినీ నిద్రపోయేలా చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దలవాయి పల్లికి చెందిన పుష్పమ్మ అనే 62 ఏళ్ల మహిళ జారి కింద పడటంతో తొడ ఎముక విరిగిపోయింది. దీంతో ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే వారం పాటు పర్యవేక్షణలో ఉంచిన వైద్యులు.. ఇక ఆమెకు ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ గదికి తీసుకెళ్లి తొడ భాగాన్ని కోసిన తర్వాత చికిత్స చేయలేము అంటూ చేతులెత్తేశారు. ఆపరేషన్ మధ్యలో ఆపేసి వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లాలి అంటూ సూచించారు. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. కాగా ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: