
అయితే ఒకప్పుడు కేవలం ఒంటరిగా ఉన్న ఆడపిల్లలపై మాత్రమే లైంగిక వేధింపులకు పాల్పడేవారు ఆకతాయిలు. కాని ఇటీవల కాలంలో ఇక ఆడపిల్లల పక్కన కుటుంబ సభ్యులు స్నేహితులు ఉన్నప్పటికీ కూడా వారిపై దాడి చేసి మరి వారి కళ్ళేదుటే అత్యాచారాలు చేస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా ప్రేమికులనే టార్గెట్ చేసుకొని ఇక వారిని బెదిరించి దాడులకు పాల్పడి యువతులపై అత్యాచారం చేస్తూ ఉన్నారు ఎంతో మంది ఆకతాయిలు. ఇక హైదరాబాద్ నగరంలో ప్రేమికులను టార్గెట్ చేసుకొని కొంతమంది యువతులపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి ఇటీవల నాంపల్లి కోర్టు శిక్ష విధించింది.
ఏకంగా సదరు నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది నాంపల్లి కోర్టు. 2017లో బ్రిజేష్ అనే మాజీ సైనికుడు హైదరాబాద్ లోని అమ్ము గూడా రైల్వేస్టేషన్లో ఉన్న ప్రేమ జంటను బెదిరించి ప్రియుడిపై దాడికి పాల్పడి అక్కడి నుంచి తరిమేసాడు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న బాలికపై అత్యాచారం చేశాడు. ఇక ఆ తర్వాత 2018లో సైతం ఇక ఇలా ఒక ప్రేమ జంటను టార్గెట్ చేసి మరో యువతిని రేప్ చేశాడు. ఇక బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అతని అరెస్టు చేసి సాక్షాదారాలతో కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.