ఇటీవల కాలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని.. ఎంతోమంది ప్రజాప్రతినిధులు ప్రసంగాల్లో గొప్పలు చెప్పుకుంటున్నారు అని చెప్పాలి. ఇక తమ ప్రభుత్వం కార్పోరేట్ ఆసుపత్రులకు దీటుగానే ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలను కల్పించింది అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. ఇక ప్రజలు ఎవ్వరూ కూడా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన పనిలేదని ప్రభుత్వాసుపత్రిలోనే మెరుగైన వైద్యం అందుతుందని చెబుతూ ఉన్నారు అని చెప్పాలి.


 అయితే ఇలా ప్రజా ప్రతినిధులు పలుమార్లు ప్రసంగాల్లో చెప్పిన మాటలు విని నిజమే అనుకొని ఒకవేళ జనాలు ప్రభుత్వాసుపత్రులకు వెళ్తే మాత్రం ఏకంగా ప్రాణాలు పోయే పరిస్థితిని ప్రభుత్వాసుపత్రి వైద్యులు తీసుకొస్తున్నారు అని చెప్పాలి. నిర్లక్ష్యమైన వైఖరితో చివరికి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి  అంతేకాదు ఇక ప్రజా ప్రతినిధులు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ చెబుతున్న అధునాతన సదుపాయాలు అటు ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పాలి. దీంతో ప్రజా ప్రతినిధులు చెప్పింది విని చివరికి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ప్రాణాల మీదికి తెచ్చుకున్నామే అని ఎంతో మంది బాధపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక రోజు రోజుకు ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న ఎన్నో దారుణ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.


 ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన అయితే ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేల చేస్తుంది. సాధారణంగా మార్చరీలో శవాలను ఎన్ని రోజులైనా భద్రపరిచే సదుపాయాలు ఉంటాయి. కానీ మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా ఆసుపత్రిలో మాత్రం భద్రపరిచిన శవాలకు భద్రత లేకుండా పోయింది. ఏకంగా శవాల కళ్ళు మాయం అవుతున్నాయ్. ఇలా 15 రోజుల్లో ఫ్రిజ్లో పెట్టిన రెండు శవాలకు సంబంధించిన కళ్ళు మాయం అయ్యాయ్. ఇక దీనిపై విచారణ జరగ్గా.. ఎలకల కారణంగానే ఇలా శవాల కళ్ళు మాయమవుతున్నాయని అధికారులు తెలిపారు. ఇక దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: