తమిళ నటుడు ధనుష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో కోలీవుడ్ సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీలతో మంచి విజయాలను అందుకొని తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ధనుష్ నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో డబ్ చేసి విడుదల చేశారు. అందులో కొన్ని సినిమాలు తెలుగు లో కూడా మంచి విజయాలను సాధించడంతో ఈయన తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే ఈయన ఇప్పటికే నేరుగా రెండు తెలుగు సినిమాల్లో కూడా నటించి రెండింటి తో కూడా మంచి విజయాలను అందుకున్నాడు.

మొదటగా ధనుష్ , వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సార్ అనే తెలుగు సినిమాలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇకపోతే కొంత కాలం క్రితమే ధనుష్ , శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేర అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది. తాజాగా ధనుష్ ఇడ్లీ కడాయి అనే తమిళ సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాని తెలుగు లో ఇడ్లీ కొట్టు అనే పేరుతో విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఈ మూవీ బృందం వారు పూర్తి చేసింది. అలాగే ఈ సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బాడీ నుండి క్లీన్ "యూ" సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 147 నిమిషాల 43 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: