
భారత్ నుంచి చదువులు, ఉద్యోగాల నిమిత్తం అమెరికా వెళ్లిన వారిని టార్గెట్ చేసుకుంటూ ఇక కాల్పులకు తెగబడుతూ ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. ఇక ఇటీవలే కాలంలో ఇలాంటి తరహా ఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. అమెరికాలో ఖమ్మం విద్యార్థి అఖిల్ సాయి పై కూడా కాల్పులు జరిగిన ఘటన సంచలనంగా మారిపోయింది. ఈ ఘటనలో అఖిల్ సాయి మృతి చెందాడు అన్న విషయం తెలిసిందే అమెరికాలోని అలాబామ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తూ ఉన్నాడు అఖిల్ సాయి. అక్కడ గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు.
ఈ క్రమంలోని సెక్యూరిటీ గార్డు దగ్గర ఉన్న గన్ పేలి అఖిల్ తలలోకి బుల్లెట్ దూసుకుపోయింది. దీంతో అతని ఆసుపత్రికి తరలించే లోపే చివరికి ప్రాణం కూడా పోయింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గన్ మిస్ ఫైర్ కాలేదని తోటి విద్యార్థి అఖిల్ సాయిని కాల్చి చంపారూ అన్నది తెలుస్తుంది. ఇలా చంపింది ఎవరో కాదు అతని రూమ్మేట్ రవితేజ గోలి అని తెలుసుకున్న పోలీసులు అతని అరెస్టు చేశారు. అయితే వీరి మధ్య ఏమైనా పాత గొడవలు ఉన్నాయా అన్న విషయంపై దర్యాప్తు చేపట్టగా.. వీరి మధ్య అసలు గొడవలే లేవు అని స్నేహితులు చెబుతూ ఉండడం గమనార్హం. దీంతో అఖిల్ సాయి మృతి ఘటన కాస్త మరింత మిస్టరీగా మారిపోయింది. ఈ క్రమంలోనే మరింత లోతుగా విచారణ చేస్తున్నారు పోలీసులు.