
ఈ క్రమంలోనే ఇక హైదరాబాద్ నగరంలో కుక్కల బెడద నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు జిహెచ్ఎంసి అధికారులు కార్యాచరణ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఇక వీధి కుక్కలు అన్నింటిని కూడా పట్టుకోవడమే లక్ష్యంగా ప్రస్తుతం గల్లీ గల్లీ చుట్టేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కేవలం హైదరాబాద్ నగరంలోనే కాదు అటు రాష్ట్రంలోని ఎన్నో పట్టణాల్లో కూడా ఇక ఇలాంటి పరిస్థితులే ఉన్నాయనేది తెలుస్తుంది. వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ఎంతోమంది పై దాడి చేస్తూ గాయపరుస్తూ ఉన్న ఘటనలు తరచూ వెలుగు చూస్తూ ఉన్నాయి.
ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో కూడా ఇక కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నిజాంబాద్ కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ కమిషనర్లు కుక్కల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు చర్యలు మొదలుపెట్టారు. ఇక జిల్లాలోని వీధి కుక్కలు అన్నింటిని కూడా పట్టుకునేందుకు ఏకంగా నేపాల్ బృందాలను ప్రత్యేకంగా రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. నేపాల్ కు చెందిన వారు తక్కువ సమయంలోనే ఎక్కువ కుక్కలను బంధించగలుగుతారట. అయితే వీటిని పట్టుకున్న తర్వాత కుక్కలను చంపేయకుండా కేవలం సంతాన నియంత్రణతో పాటు ఇతర చర్యలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.