మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మన శంకర వర ప్రసాద్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నయనతార హీరోయిన్గా నటిస్తూ ఉండగా ...  టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. బీమ్స్ సిసిరిలీయో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యం లో ఈ మూవీ బృందం వారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాలను లభిస్తుంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన మొదటి సింగిల్ ప్రోమోను కూడా విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ లో షైన్ టామ్ చాకో విలన్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

అనిల్ రావిపూడి కామెడీ సన్నివేశాలను వెండి తెరపై అద్భుతంగా తెరకెక్కిస్తాడు అనే విషయం మన అందరికి తెలిసిందే. ఇకపోతే విలన్ తో కూడా ఈయన కామెడీ సన్నివేశాలను అద్భుతంగా పండిస్తూ ఉంటాడు. షైన్ టామ్ చాకో సినిమాల్లో పెద్దగా కామెడీ చేయకపోయినా ఆయన బయట చాలా కామెడీ చేస్తూ ఉంటాడు. దానితో మన శంకర వర ప్రసాద్ సినిమాలో ఈయన విలన్ పాత్రలో నటించబోతున్నాడు అనే వార్త బయటకు రావడంతో ఈ సినిమాలో అనిల్ రావిపూడి , షైన్ టామ్ చాకో తో అద్భుతమైన కామిడీ ని పండిస్తాడు అని జనాలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: