
ఎందుకంటే ఇక కట్టుకున్న వారి తోనే కలకాలం జీవించాలి అనుకోవడం లేదు ఎవరు కూడా. ఏకంగా పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి చివరికి దారుణంగా కట్టుకున్న వారినే హతమరుస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇక ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఇలా ప్రాణం పోతుందా అని ఎంతోమంది యువతి యువకులు కూడా భయపడుతున్నారు. ఇక పెళ్లి అనే ఆలోచననే విరమించుకుంటున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ గతన వెలుగు చూసింది. ఏకంగా భర్త ముఖంపై దిండు పెట్టి సినిమా స్టైల్ లో హత్య చేసింది భార్య.
హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ పరిధి తుర్క యంజాల్ లో నివసిస్తూ ఉంటాడు 52 ఏళ్ల పున్నయ్య. కాగా అతని తోనే ఉంటుంది భార్య యాదమ్మ. అయితే యాదమ్మ జిహెచ్ఎంసిలో స్వీపర్‌గా పనిచేస్తూ ఉండగా.. ఇక పొన్నయ్య జిహెచ్ఎంసి లోనే కూలి పని చేస్తాడు. అయితే వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఇటీవలే మరోసారి రాత్రి ఇద్దరు కల్లు తాగిన మత్తులో గొడవపడ్డారు. సహనం కోల్పోయిన యాదమ్మ కోపంతో భర్త ముఖంపై దిండుతో అదుమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితురాలని అదుపులోకి తీసుకున్నారు..