ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా వీధికి కళ్ళు స్వైర విహారం చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. మనుషులు కనిపించారు అంటే చాలు ఏకంగా మనుషులతో జాతి వైరం ఉన్నట్లుగానే వ్యవహరిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అప్పటి వరకు ఎంతో సదా సీదా గానే ఉన్న కుక్కలు ఒక్కసారిగా రెచ్చిపోతున్నాయి. దీంతో ఇక రోడ్డు పక్కన వెళ్తున్న మనుషులపై దాడి చేస్తున్న చిన్నల నుంచి పెద్దల వరకు ఎవరిని వదలడం లేదు. దీంతో కుక్కల దాడిలో గాయపడి ప్రాణాలు వదులుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది అని చెప్పాలి.


 ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్న పిల్లలను టార్గెట్ గా మార్చుకుంటున్న కుక్కలు దారుణంగా దాడి చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.  ఇలాంటి తరహా వీడియోలు చాలానే సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన ఒకటి జరిగింది. అభం శుభం తెలియని ఒక చిన్నారి చివరికి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కళ్యాణదుర్గంలోని బ్రహ్మ సముద్రం మండలంలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. రెండు నెలల క్రితం చిన్నారికి కుక్క కరవగా  ఇటీవల హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది.



 ఉప్పలకుంట గ్రామానికి చెందిన చిన్నారిని రెండు నెలల క్రితం కుక్క కరిసింది. అయితే అప్పటినుంచి అనారోగ్యం బారిన పడింది చిన్నారి. ఇక ఇటీవల చిన్నారి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తూ వచ్చింది. అయితే తల్లిదండ్రులు ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి ఇక చిన్నారి చికిత్స కోసం ఎంతలా డబ్బులు ఖర్చుపెట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇటీవల ఆరోగ్యం మరింత విషమించడంతో బెంగుళూరు కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది అని చెప్పాలి. దీంతో ముప్పలకొండ గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: