
అయితే ఇలా కుక్కల దాడి ఘటనలు కేవలం ఒక్క రాష్ట్రంలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రతి చోటా కూడా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఏకంగా కుక్కలు దారుణంగా మనుషులపై దాడి చేసి చంపుతున్న తీరు చూసి ప్రతి ఒక్కరు వెన్నులో వణుకు పుడుతుంది అని చెప్పాలి. ఇటీవల ఇలాంటి ఓ దారుణమైన ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. మార్నింగ్ వాక్ కు వెళ్ళిన ఒక వ్యక్తిపై కుక్కల గుంపు ఒక మూకుమ్మడుగా దాడి చేసాయ్. దారుణంగా ప్రాణాలు తీసేసాయి అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.
ఉత్తర ప్రదేశ్ లోని అలిఘర్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్లో డాక్టర్ సప్తర్ అలీ అనే వ్యక్తి రోజు లాగానే ఉదయం 6 గంటల సమయంలో మార్నింగ్ వాక్ కి వెళ్ళాడు. అయితే పార్కులో ఒక చోట నిలబడి వ్యాయామం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అక్కడున్న కుక్కలు ఒక్కసారిగా అతనిపై దాడి చేశాయ్. పది కుక్కలు గుంపుగా ఏర్పడి దాడి చేయడంతో తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇక నోటితో కరుస్తూ తీవ్రంగా గాయపరిచాయి అని చెప్పాలి. అయితే తీవ్ర గాయాలతో ఉన్న సప్తర్ అలీ చివరికి సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. అయితే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని సీసీటీవీ పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.