ప్రేమ అనేది కేవలం మధురానుభూతులకు చిరునామాగా మాత్రమే ఉండేది. కానీ ఇటీవల కాలం లో ప్రేమ కూడా ఒక కమర్షియల్ ఎలిమెంట్ గా మారి పోయింది. ఈ క్రమం లోనే ప్రేమ అనే ముసుగు వేసుకుంటున్న ఎంతో మంది యువతి యువకులు ఇక తమ అవసరాలు తీర్చుకుంటున్నారు అని చెప్పాలి. అంతే కాదు ఇక ప్రేమించిన వ్యక్తులపైనే పగ పెంచుకొని దారుణం గా హతమారుస్తున్న ఘటనలు కూడా వెలుగు లోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి.ఇలా ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన ఘటనలు చూసిన తర్వాత ప్రేమించిన పాపానికి ఇలాంటి దారుణాలు చూడాల్సి వస్తుందా వామ్మో.. ప్రేమ దోమ జోలికి వెళ్లకపోవడమే చాలా బెటర్ అని ఎంతో మంది అనుకుంటున్నారు అని చెప్పాలి.  ఇక్కడ ప్రేమ ముసుగులో మరో దారుణం జరిగిపోయింది. ఏకంగా ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న ప్రియుడు ఇక పక్కా ప్లాన్ ప్రకారం ఆమెను దారుణంగా చంపేశాడు. ఈ దారుణమైన హత్యకు సంబంధించిన కఠిన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది.


 తనను ప్రేమిస్తున్నట్టు నటిస్తూనే తన ప్రియురాలు వేరొకరితో వాట్సాప్ లో చాటింగ్ చేస్తుంది అని అనుమానం పెంచుకున్నాడు ప్రియుడు. ఈ క్రమంలోనే ఓ రోజు ప్రేమగా మాట్లాడుతూనే చివరికి దారుణంగా హత్య చేశాడు. పోలీస్ డిపార్ట్మెంట్ లో క్లర్క్ గా పని చేస్తున్న నవ్య ఆరేళ్లుగా ప్రశాంత్ తో రిలేషన్ షిప్ లో ఉంది. ఇక ఈనెల 11వ తేదీన నవ్య బర్త్ డే కాగా ఆమె పుట్టినరోజు వేడుకలకు ప్రశాంత్ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే పక్కా ప్లాన్ ప్రకారం తర్వాత రోజు కేక్ కట్ చేయించడానికి పిలిచాడు ప్రశాంత్. ఆమెను పిలిచి కేక్ కట్ చేయించాడు. ఆ తర్వాత ఫోటోలు కూడా దిగాడు. చివరికి ఆమె గొంతు కోసి దారుణంగా చంపేశాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: