
వెరసి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రాణం ఏ క్షణంలో పోతుందో కూడా చెప్పలేని విధంగా మారిపోయింది ప్రస్తుత పరిస్థితి. ఇక ఇలాంటి సడన్ హర్ట్ ఎటాక్లకు సంబంధించిన ఘటనలు అయితే తరచూ సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి గుండెపోటు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అప్రమత్తమయ్యి ఆసుపత్రికి తరలించే లోపే చివరికి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్. ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటన వెలుగు చూసింది.
చౌటుకూరు మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పని చేస్తూ ఉంటుంది పద్మలత. ఇటీవలే సడన్ హార్ట్ ఎటాక్ తో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అప్పటివరకు ఎంతో ఎనర్జీతో పిల్లలకు పాఠాలు చెప్పిన ఆమె క్లాస్ రూమ్ నుంచి బయటకు మంచినీళ్లు తాగి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. మిగతా సిబ్బంది గమనించి ఆమెనూ ఆస్పత్రికి తీసుకువెళగా పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే అప్పటివరకు కళ్ళ ముందు ఎంతో హుషారుగా ఉన్న సహోద్యోగి ఆకస్మిక మరణాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు మిగతా టీచర్లు.