
అసలు సడన్ హార్ట్ ఎటాక్ లు ఎందుకు వస్తున్నాయి.. ఎందుకు ఇలా ప్రాణాలు తీసేస్తున్నాయి అన్న ప్రశ్నకు ఇప్పటికీ ఎవరికీ సమాధానం తెలియడం లేదు. కానీ ఇలా సడన్ హార్ట్ ఎటాక్ల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే సడన్ హార్ట్ ఎటాక్ లు ఇప్పటికీ ప్రాణాలు తీస్తూ ఉంటే.. మరోవైపు ప్రకృతి విపత్తులు కూడా పగ పట్టినట్లుగానే వ్యవహరిస్తూ ప్రాణాలను గాల్లో కలిపేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘాటనే జరిగింది.
క్రికెట్ ఆడుతూ 22 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. అయితే క్రికెట్ ఆడుతూ మరణించాడు అనగానే అతనికి సడన్ హార్ట్ ఎటాక్ వచ్చింది అనుకోకండి.. సడెన్ హార్ట్ ఎటాక్ కాదు ఏకంగా ప్రకృతి విపత్తు అతని ప్రాణం తీసింది. విజయనగరం లోని గాజుల రేఖలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతున్న వారిపై పిడుగు పడటంతో 22 ఏళ్ళ ఇజ్రాయిల్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అఖిల్, సురేష్ అనే మరో ఇద్దరు గాయపడ్డారు. ఇక వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చేతికొచ్చిన కొడుకు విగత జీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.