
కానీ ఆ తర్వాత మాత్రం ఆమె గర్భం దాల్చడం సంచలనంగా మారిపోయింది. ఈ ఘటన మధురైలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. తూత్తుకుడి ప్రాంతానికి చెందిన దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కుటుంబ పోషణ చూసుకుంటున్నాడు. ఇక వీరి ఆదాయం అంతంత మాత్రం కావడం వారికి పుట్టిన ఇద్దరు కూడా ఆడపిల్లలే కావడంతో పోషణ భారంగా మారింది. దీంతో ఇక పిల్లలు చాలు అని నిర్ణయానికి వచ్చారు ఆ భార్యాభర్తలు. ఇక 2013లో కూడా ప్రభుత్వ వైద్యశాలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది ఆ మహిళ.
కానీ ఊహించని విధంగా 2014లో మళ్లీ గర్భం దాల్చింది. ఇక 2017లో మూడో బిడ్డకు జన్మనిచ్చింది సదర మహిళ. ఆపరేషన్ చేయించుకున్నాక ఎలా గర్భం వచ్చిందో అర్థం కాక ఆమె షాక్ అయింది. ఇక వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది అన్న విషయాన్ని అర్థం చేసుకుంది. దీంతో బాధితురాలు 2016లో కోర్టును ఆశ్రయించింది. అయితే ఇక ఈ కేసులో మధురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాధితురాలు మూడో బిడ్డ చదువు, పుస్తకాలు, ఖర్చులు అన్నిటినీ ప్రభుత్వం భరించాలి అంటూ ఆదేశించింది. పిల్లల పోషణ నిమిత్తం కుటుంబానికి ఏడాదికి 1.20 లక్షలు లేదా మరోబిడ్డకు డిగ్రీ వయసు వచ్చేంతవరకు నెలకు పదివేలు అందించాలంటు తీర్పునిచ్చింది.