రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ప్రతిక్షణం కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన కూడా చివరికి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా వాహనాలు నడిపే సమయంలో ముందు వెనకనుంచి వాహనాలు ఎలా వస్తున్నాయి అని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలి. అవన్నీ మనకెందుకు మన దారిలో మనం వెళ్దాం లే అనుకుంటే మాత్రం ఎదురుగా వచ్చే వాహనం ఢీకొని చివరికి ప్రాణాలు అటు నుంచి అటే గాల్లో కలిసిపోతాయి.


 ఇలా ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు. అయితే రోడ్డు నిబంధనలు పాటించి ప్రతిఒక్కరు వారి ప్రాణాలకు వారే రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూ ఉన్న ఎవరిలో మాత్రం మార్పు రావడం లేదు అని చెప్పాలి. దీంతో ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసే విధంగా ఎన్నో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఘటనలు తెరమీదకి వస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అయితే కొంతమంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ చివరికి చేజేతులారా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇక ఇటీవల డెహ్రాడూన్ లో కూడా ఇలాంటి ఒక ఒళ్ళు గోగుర్పాటుకు గురి చేసే యాక్సిడెంట్ జరిగింది.


 ఏకంగా రెప్పపాటు కాలంలో ఘోరం జరిగిపోయింది అని చెప్పాలి. స్కూటీని బస్సు ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.  హరిద్వార్ బైపాస్ దగ్గర ఒక మహిళ స్కూటీపై రోడ్డు క్రాస్ చేసేందుకు ప్రయత్నించింది.  అయితే మరోవైపు నుంచి వేగంగా దూసుకు వస్తున్న ఆర్టీసీ బస్సును మాత్రం ఆ మహిళ గమనించలేదు. ఈ క్రమంలోనే మహిళా స్కూటీతో రోడ్ క్రాస్ చేస్తుండగా వేగంగా దూసుకు వచ్చిన ఆర్టీసీ బస్సు ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కాగా మృతురాలు పేరు ప్రీతీ అని ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తుంది అని పోలీస్ విచారణలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: