ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... కొబ్బరి బొబ్బట్లు ఎంత రుచికరంగా వుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా తియ్యగా రుచికరంగా ఉంటాయి. ఈ రుచికరమైన బొబ్బట్లను పండగ సందర్భాలలో చేసుకోని తింటే చాలా బాగుంటాయి... ఇక ఈ కొబ్బరి బొబ్బట్లని ఎలా చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి...

కొబ్బరి బొబ్బట్ల తయారీకి కావాల్సిన పదార్ధాలు...

మైదా - ఒక కప్పు, కొబ్బరి తురుము - ఒక కప్పు, నీళ్లు - ఒక కప్పు, కొబ్బరి నూనె - ఒక టీస్పూను, బెల్లం తురుము - ఒక కప్పు, పసుపు - పావు టీ స్పూను, యాలకుల పొడి - ఒక స్పూను, నెయ్యి - రెండు స్పూనులు, ఉప్పు - చిటికెడు

కొబ్బరి బొబ్బట్లు తయారు చేయు విధానం...

ఓ గిన్నెలో మైదా, పసుపు, ఉప్పు కాస్త నీళ్లు వేసి పిండిలా కలపాలి. అందులో కొంచెం కొబ్బరి నూనె కూడా వేసి బాగా కలపాలి. బొబ్బట్లకు ఎంత పదునుతో పిండిని కలుపుకుంటామో అలాగే కలుపుకుని ఓ 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద నీళ్లు, బెల్లం తురుము వేసి కరిగించాలి. మలినాలుంటే తీసేయాలి. ఆ బెల్లం మిశ్రమాన్ని వడకట్టాలి. ఆ బెల్లం మిశ్రమంలో కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి కలపాలి. ఇప్పుడు ఆ బెల్లం, కొబ్బరి మిశ్రమాన్ని మళ్లీ స్టవ్ మీద పెట్టాలి. తేమ పోయేంత వరకు ఉడికించి స్టవ్ కట్టేయాలి. ఆ మిశ్రమాన్ని బాగా చల్లార్చాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం తీసుకుని ఉండలా చుట్టి చేత్తొనే పూరీ లా ఒత్తి మధ్యలో... కొబ్బరి మిశ్రమం పెట్టాలి. అంచుల్నీ మూసేసి... మళ్లీ గుండ్రంగా ఒత్తేయాలి. పెనం మీద నెయ్యి వేసి బొబ్బట్టుని దోరగా కాల్చుకోవాలి. సర్వ్ చేసే ముందు బొబ్బట్లపై ఓ చుక్క నెయ్యి వేసి సర్వ్ చేస్తే బాగుంటుంది.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... ఇంకా మరెన్నో వంటకాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: