కావాల్సిన పదార్ధాలు....
బ్రొకొలి - 2 పువ్వులు,
ధనియాలు - 1tps
కొత్తిమీర - 1 కట్ట
కొబ్బరి తురుము- 1/2cup
కరివేపాకు - 2 రెబ్బలు
పచ్చిమిర్చి - 4-6
ఎండుమిర్చి - 4
జీడిపప్పులు - 8-10
ఉప్పు - రుచికి సరిపడా
పోపుకోసం కావల్సిన పదార్థాలు:
మినపప్పు
ఆవాలు
జీలకర్ర - అర టీ స్పూను చొప్పున
ఇంగువ - చిటికెడు
నూనె - సరిపడా
తయారు చేయు విధానం:
ముందుగా బ్రొకోలిని ముక్కలుగా తరిగి ఆవిరిపైన 3 నిమిషాలు ఉడికించాలి.తర్వాత పాన్ లో ధనియాలు, కొత్తిమీర, కొబ్బరి తురుము వేగించి, చల్లార్చి జీడిపప్పుతో పాటు (కొద్ది నీరు కలిపి) మెత్తగా రుబ్బుకోవాలి.మసాలాను సిద్దం చేసుకొన్న తర్వాత పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక అందులో పోపుకోసం సిద్దం చేసుకొన్న వాటిని ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగించుకోవాలి.పోపు వేగిన తర్వాత అందులోనే ముందుగా ఆవిరి మీద ఉడికించుకొన్నబ్రొకొలి ముక్కలు వేయాలి.బ్రోకోలీ కూడా మసాలాతో పాటు రెండు నిమిషాలు వేగిన తర్వాత మసాలా పేస్టు కలిపి సన్నని మంటపై ఫ్రై చేసుకోవాలి.గ్రేవీ చిక్కగానే మారినప్పుడు స్టౌ ఆఫ్ చేసి దింపుకోవడమే ఆలస్యం...వేడి వేడి అన్నం, చపాతీలలోనికి తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఇంట్లో ఈ రెసిపీని ట్రై చెయ్యండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి...ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి