వెరసి కష్టసుఖాల్లో తోడుంటాడు అనుకున్న భర్తే దారుణంగా కట్టుకున్న భార్యను హతమార్చిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన తల్లిని భార్య సరిగా చూసుకోవడం లేదు అన్న కారణంతో భర్త కి కోపం వచ్చింది. ఈ క్రమంలో కట్టుకున్న భార్య విషయంలో కనీస కనికరం లేకుండా దారుణానికి ఒడిగట్టాడు ఆ భర్త. క్షణికావేశంలో భార్య గొంతు నులిమి చంపేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కు చెందిన రవి దంపతులు హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్నారు.
అయితే రవి తన తల్లిని సరిగా చూసుకోవడం లేదు అనే కారణంతో భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇటీవలే మరో సారి ఇదే విషయంపై భార్య భర్తలు ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఈ క్రమంలోనే కోపంతో రగిలిపోయిన రవి మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి భార్యపై దాడి చేశాడు అంతటితో ఆగకుండా గొంతు నులిమి దారుణంగా హతమార్చాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి